భారత్ దర్శన్ పథకంలో భాగంగా అరకు, లంబసింగిలకు రూ. 75 కోట్ల మంజూరు చేసినట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. విశాఖలోని రాక్‌డేల్ హోటల్‌లో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అన్నవరం, శ్రీశైలం, అమరావతి ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో కూడా అల్లూరి 125 వ జయంత్యుత్సవాలు ఘనంగా చేస్తామని స్పష్టం చేశారు. రాజమండ్రిలో సంగీత నాటక అకాడమీ ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు.
విశాఖలాటి మహానగరంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కేంద్రం ఇచ్చే ప్రాజెక్టులు, సంస్థలూ ఉత్తరాంధ్రకు వచ్చేలా మాధవ్ సమన్వయం చేస్తారన్నారు. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ నినాదానికి కేంద్రం కట్టుబడి ఉంది. పర్యాటక శాఖ నుంచి ఈ ప్రాంతానికి భారీ పథకాలు ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి మాధవ్, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు.