ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెట్టుబడుల పేరుతో భూకబ్జా,,,ఎంపీ రఘురామకృష్ణరాజు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 05, 2023, 12:12 AM

విశాఖ సమ్మిట్ అనేది ఒక మాయా బజార్ అని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. పెట్టుబడుల పేరుతో భూకబ్జాలకు ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. విశాఖలో జరుగుతున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వల్ల ఒరిగేది ఏమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు.  ఈ స్థల యజ్ఞం ఏమిటని ప్రశ్నించారు. ఈ కంపెనీలకు 7 లక్షల ఎకరాల భూమిని ఎలా ఇస్తారని ప్రశ్నించారు. నాలుగేళ్ల కాలంలో చేసిందేమీ లేదని... అందుకే ఇప్పుడు ఒప్పందాలు చేసుకుంటున్నారని విమర్శించారు. తమ ముఖ్యమంత్రి జగన్ పుట్టక ముందు నుంచే విశాఖ ఉందని, అక్కడ పరిశ్రమలు ఉన్నాయని అన్నారు. సజావుగా పరిపాలన కొనసాగించాలని సీఎంను కోరుతున్నానని చెప్పారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com