నాగాలాండ్ రోడ్లపై డబ్బుల వర్షం కురిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ పీపుల్స్ పార్టీ(NPP) ఇతర పార్టీల కంటే అధిక సీట్లను కైవసం చేసుకుంది. దీంతో ఆ పార్టీ కార్యకర్తల సంబరాలు అంబరాన్నంటాయి. ఈక్రమంలో పార్టీ అధ్యక్షుడి ఇంటి ముందు కరెన్సీ నోట్లు జల్లుతూ హల్చల్ చేశారు. కార్యకర్తలు డబ్బు నోట్లను వెదజల్లుతుంటే వాటిని అందుకోవటం కోసం జనాలు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.