అరటి పండును ఉడకబెట్టుకుని తింటే ఎన్నో పోషకాలు అందుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 5 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత తొక్క తీసి పీనట్ బటర్, తేనె, దాల్చిన చెక్క పొడి వేసుకుని తినాలి. ఇలా తింటే జీర్ణ సమస్యలు, మలబద్ధకం, దగ్గు వంటి సమస్యలు తొలగుతాయని అంటున్నారు. ఆఫ్రికా వంటి దేశాల్లో అరటిని ఇలా చేసి అతిసార వ్యాధి చికిత్సలో వాడతారని చెబుతున్నారు.