వివాహిత అదృశ్యంపై ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ప్రత్తిపాడు చెందిన పల్లం శాంతకుమారి, జక్రయ్య దంపతులు. గత కొంతకాలంగా స్థానికంగా నివాసం ఉంటున్నారు. గత నెల 28వ తేదీ మధ్యాహ్నం ఒకటి గంట సమయంలో ఇంటి నుంచి ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లి పోయింది. బంధువుల ఇళ్లల్లో, స్నేహితులు వద్ద వెతికిన ఆచూకీ లేదు. దీంతో ఆమె భర్త పల్లం జక్రయ శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు.