అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రూపెనగుంట్లకు చెందిన ఆనంద్ మద్యం అమ్ముతుండగా అదుపులోకి తీసుకుని, 16 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని ఏఎస్సై ప్రసాద రావు తెలిపారు. నకరికల్లు మండల పరిధిలో ఏ విధమైన చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు