కుర్చీలోనో, మంచంమీదో కూర్చుని కాళ్లు ఊపితే మన పెద్దలు అస్సలు సహించరు. ఇలా కాళ్లు ఊపడం వల్ల చాలా నష్టాలున్నాయి. ఖాళీగా కూర్చుంటే డబ్బులు రావు. ఏదో ఒక పని చేస్తే డబ్బులు వస్తాయి. పనిలేని వారే అలా కాళ్లు ఊపే అలవాటు చేసుకుంటారనే కోణంలో పెద్దలు ఈ మాటలు చెప్పి ఉంటారనేది ఓ వాదన. అయితే కూర్చున్నప్పుడు కాళ్లను కదపడం వల్ల కీళ్లకు హాని కలుగుతుంది. మీ కాళ్లలోని నరాలు వ్యతిరేక ప్రభావాన్ని అనుభవించవచ్చు.