ఇంటి నుంచి వెళ్లిన కుమారుడి తిరిగి రాలేదని తండ్రి నాదెండ్ల పోలీస్ లను ఆశ్రయించారు. గణపవరంలో భవన నిర్మాణ కార్మికునిగా పనిచేసే తన్నీరు పోలయ్య గత నెల 27న ఇంటి నుంచి వెళ్ళాడు. తిరిగి రాకపోవటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వెతికిన ఆచూకీ లేకపోవడంతో అతని తండ్రి అంకమ్మ పోలీస్ లకు శనివారం ఫిర్యాదు చేశాడు.