చాలా మంది సీజన్ తో సంబంధం లేకుండా నోటిపూతతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు తేనె, పసుపు కలిపి నోటి పూత ఉన్న చోట రాస్తే మంట నుంచి ఉపశమనం పొందొచ్చు. మంచి నీరు, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నెయ్యి, ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలని, మసాలా ఉన్న ఆహారాన్ని తగ్గించాలని అంటున్నారు. తమలపాకులు నమిలి తిన్నా సమస్య తొలగుతుందంటున్నారు.