గత రెండు నెలలుగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న మాచర్లలో మెగా పెంచామని, మాచర్ల సిఐ బాలకృష్ణ అన్నారు. ఆయన విలేకరులతో శనివారం మాట్లాడుతూ అల్లరి మూకల కదలికలపై దృష్టి పెట్టామని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల పేరుతో అల్లర్లు చేస్తే కఠినంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. 10 రోజులుగా పట్టణంలోని ప్రధాన కూడళ్లలో గంజాయి విక్రయాలు, సేవించే వారి విషయంలో సమాచారం మేరకు దాడులు చేస్తున్నట్లు తెలిపారు.