బయటి నుంచి తెచ్చిన పండ్లను మనం వెంటనే ఫ్రిజ్ లో పెట్టేస్తూ ఉంటాం. అయితే ఇలా ఫ్రిజ్ లో అన్ని పండ్లు, కూరగాయలు పెట్టకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా టమోటాలను ఫ్రిజ్ లోనే పెడతాం. దాని వల్ల అవి సహజత్వాన్ని కోల్పోతాయి. అలాగే సగం కోసిన పుచ్చకాయ, గుడ్లు, వంకాయలు, ఉల్లిపాయలు, చాక్లెట్లు, బ్రెడ్, బత్తాయి పండ్లు, తేనె, కాఫీ గింజలు, దోసకాయలు, స్ట్రాబెర్రీస్ లాంటివి ఫ్రిజ్ లో పెట్టకూడదు.