దాచేపల్లి నగర పంచాయతీలో ప్లంబరు గా పనిచేస్తున్న గరికపాటి కోటేశ్వరరావు హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ షేక్ బిలాలుద్దీన్ చెప్పారు. గత నెల 24న జరిగిన హత్య కేసులో నిందితులైన ప్లంబరు సైదులు, ఆయన భార్య కోటమ్మ కుమారుడు నాగరాజును అరెస్టు చేసి శనివారం గురజాల కోర్టుకు హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ కు ఆదేశించినట్లు తెలిపారు.