మేడికొండూరు మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం పదోతరగతి ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంపిపి స్వప్న అన్నారు. స్థానిక ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం జరిగిన ప్రభుత్వం పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల నాడు నేడు కార్యక్రమం పనులు వేగవంతం చేయాలని అన్నారు. బైజ్యూస్ ట్యాబ్ ల పనితీరు మెరుగుపరుచుకోవాలని, విధ్యార్థుల హాజరు పై శ్రద్ధ వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు, మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.