ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశం మెుత్తం ఏపీ వైపు చూస్తోంది... మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 05, 2023, 01:34 PM

విశాఖ సమిట్‎తో దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందని  వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  చెప్పారు. ఏపీలో రూ.13.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారని తెలిపారు. ఏపీకి పెట్టుబడి పెట్టేవాళ్లు లేరని ప్రచారం చేసే వారికి చెంపపెట్టులా సీఎం జగన్ సమాధానం చెప్పారన్నారు. సీఎం జగన్ మొదటి నుంచి ఓ విజన్‎తో ముందుకు వెళ్తున్న నాయకుడని ఆయన కొనియాడారు. 


ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖేష్ అంబానీ లాంటి వ్యాపారవేత్తలు ముందుండి విశాఖ సదస్సును విజయవంతం చేశారని కొనియాడారు. పెట్టుబడుల సదస్సుతో లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. గతంలో టీడీపీ హయాంలో ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చారో సమాధానం చెప్పాలని బాలినేని డిమాండ్ చేశారు. ఏపీని దేశంలోనే అగ్రగామికి నిలబెట్టేందుకు జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశ్యంతోనే విశాఖను రాజధానిగా చేసినట్లు వెల్లడించారు. అభివృద్ధి చెందిన సిటీని మరింత వేగంగా అభివృద్ధి చేయవచ్చని, అమరావతి లాంటి ప్రాంతాన్ని అభివృద్ది చేయాలంటే రూ. లక్షల కోట్లు కావాలని అన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com