గ్యాస్ సిలిండ్ తీసుకెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సెకండ్ల వ్యవధిలో మంటలు చెలరేగాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి సమీపంలోని విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై ఈ మంటలు చెలరేగిన ఘోర ప్రమాదం మాత్రం తప్పింది. సీఎన్‌జీ గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళుతోన్న ఓ లారీలో శనివారం రాత్రి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సిలిండర్లకు మంటలు అంటుకోకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు.
లారీలో మంటల చెలరేగటంతో విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లారీ కాకినాడ నుంచి హైదరబాద్ వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మెుదటగా లారీ క్యాబిన్‌లో మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంజిన్‌లో నిప్పురవ్వలు చెలరేగి క్యాబిన్‌లో మంటలు వచ్చాయి. ఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్, క్లీనర్ లారీని అక్కడే వదిలేసి పరారయ్యారు.
లారీలో మొత్తం 161 హైడ్రోజెన్ గ్యాస్ సిలిండర్లు ఉన్నట్లు అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. లారీ క్యాబిన్‌కి ట్రక్కుకి గ్యాప్ ఎక్కువ ఉండటం, లారీ క్యాబిన్ ఐరన్ ది కావడంతో మంటలు సిలిండర్లకు అంటుకోలేదని తెలిపారు. లేదంటే రహదారిపై పెను ప్రమాదమే జరిగి ఉండేదని అన్నారు.