కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం ఇంచార్జి వరుపుల రాజా మృతి చెందారు. గుండెపోటుకు గురైన రాజాను కుటుంబ సభ్యులు కాకినాడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈరోజు వరుపుల రాజా భౌతికకాయానికి నివాళులర్పించారు. రాజా మృతదేహంపై తెలుగుదేశం జెండా కప్పారు. వరుపుల రాజా భార్య, పిల్లలను చంద్రబాబు పరామర్శించారు. వారికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.