తాను సోమవారంనాడు విచారణకు రాలేను అని కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున.. ఈనెల 6న (సోమవారం) తాను విచారణకు రాలేనని స్పష్టం చేశారు. కడప జిల్లా వేంపల్లి, పులివెందులలో ముందుగా ప్లాన్ చేసుకున్న కార్యక్రమాలు దృష్ట్యా.. హైదరాబాద్‌కు రాలేనని లేఖలో వివరించారు. అవినాష్‌రెడ్డి లేఖపై సీబీఐ అధికారులు నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అయితే.. సోమవారం అవినాష్‌రెడ్డి కి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటు అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి సోమవారం విచారణకు రావాలని సీబీఐ గతంలోనే నోటీసులు ఇచ్చింది.
సీబీఐ ఇప్పటికే అవినాష్‌రెడ్డిని రెండు సార్లు విచారించింది. జనవరి 28న, ఫిబ్రవరి 24న సీబీఐ ప్రశ్నించింది. ఇక ఈ నెల 12న కడప సెంట్రల్ జైలులో జరిగే విచారణకు హాజరుకావాల్సిందిగా వైఎస్ భాస్కర్‌రెడ్డికి మూడురోజుల కిందటే సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే.. చెప్పిన తేదీ కంటే వారం ముందే వైఎస్ భాస్కర్‌రెడ్డిని విచారణకు రమ్మని పిలవడంతో.. ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. 2019 మార్చి 15న వివేకానంద రెడ్డి పులివెందుల (Pulivendula) లోని తన స్వగృహంలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య బయట ప్రపంచానికి తెలియకముందే.. అవినాష్ రెడ్డికి తెలుసునని సీబీఐ అనుమానిస్తుట్టు వార్తలు వచ్చాయి.