నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఏప్రిల్ 1 నుండి టోల్ ఛార్జీలను 5 శాతం నుండి 10 శాతానికి పెంచనున్నారు.ప్రస్తుత పరిస్థితులు, వినియోగదారుల సంఖ్య, గతంలో వసూలు చేసిన టోల్ ఫీజుల ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్‌హెచ్‌ఎఐ టోల్ వసూలులో మార్పుల కోసం కేంద్ర రోడ్డు మరియు రవాణా శాఖకు ప్రతిపాదనలు పంపుతుంది. మార్చి చివరి వారంలోగా దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు కార్లు, సాధారణ వాహనాలకు ఎంత రుసుము వసూలు చేయాలి? భారీ వాహనాలకు ఎంత వసూలు చేయాలనే దానిపై అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనుంది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.