పిడుగురాళ్ల మండలం రైల్వే స్టేషన్ ను ఆదర్శ రైల్వే స్టేషన్ గా తీర్చిదిద్దుతామని డిఆర్ఎం రామకృష్ణ అన్నారు. గుంటూరు డివిజన్లో 16వ రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి అమృత్ భారత్ పథకంలో భాగంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని దీనిలో భాగంగా ఆదివారం పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ పరిశీలించడం జరిగిందన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం విశ్రాంతి గది, ఓవర్ బ్రిడ్జి, లిఫ్ట్ సౌకర్యం వంటి వసతులు త్వరలో కల్పిస్తామన్నారు.