హిందూపురం పట్టణ పరిధిలోని నింకంపల్లి రోడ్డులో ఉన్న యల్లమ్మ దేవి ఆలయంలో అమ్మవారి విగ్రహం పై సూర్యకిరణాలు పడుతున్నాయి. ఉత్తరాయణ పుణ్యకాలం సందర్భంగా పాల్గుణమాసంను పురస్కరించుకొని సూర్య కిరణాలు నేరుగా అమ్మవారి విగ్రహంపై పడుతాయని ఆలయ పూజారి పేర్కొన్నారు. ప్రతి యేడాది ఈ సుభతరుణం కోసం పరిసర ప్రాంతాల ప్రజలు ఎదురు చూస్తారని, సోమవారం అమ్మవారికి దర్శించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. పూర్య భగవానికి కిరణాలు ఇలా ఆలయంలో మూల విరాట్‌ను తాకడం సుభసూచకంగా భావిస్తారని పేర్కొన్నారు.