శివలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్స వాల సందర్భంగా రెండు రోజులుగా యాడికి మండల కేంద్రంలోని చెన్నకేశవస్వామి దేవాలయం ముందు నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో నంద్యాల జిల్లా ప్యాపిలి జట్టు విజేతగా నిలిచిందని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు తెలిపారు. ఆదివారం రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కబడ్డీ పోటీలకు 40 టీములు హాజరయ్యాయి. పోటా పోటీగా జరిగిన కబడ్డీ పోటీల్లో ప్యాపిలి జట్టు విజేతగా నిలిచింది. వీరికి యాడికి గౌస్ మహమ్మద్ రూ. 40 వేల నగదు అందజేశారు. రన్నరప్ గా నిలిచిన అనంతపురం జిల్లా యాడికి. మండలం కేశవరాయునిపేట జట్టుకు యాడికికి చెందిన హరిప్రసాద్, హరికృష్ణ రూ. 30 వేలను అందించారు. మూడోస్థానంలో నిలిచిన అనంతపురం వివేకానంద స్పోర్స్ క్లబ్ కు కోటి రమేష్ రూ. 20 వేలు, నాలుగో స్థానంలో నిలిచిన తమిళ నాడు రాష్ట్రం సేలం జట్టుకు డాక్టర్ శిరీష రూ. 10 వేలను అదించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బొంబాయి రామిరెడ్డి, ఉప సర్పంచు కాసా చంద్రమోహన్, ఎంపీటీసీలు నాగ రాజు, రామ్మోహన్, వెంకటరాముడు వార్డు మెంబర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.