దేశ వ్యాప్తంగా జ్వరాలు దడ పుట్టిస్తున్నాయి. ఇన్ఫ్లుయంజా వైరస్ లక్షణాలైన దగ్గు, జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పుల వంటి లక్షణాలతో జనాలు సతమతమవుతున్నారు. భయాందోళనతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ICMR హెచ్చరించింది. ఈక్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటింటా ఫీవర్ సర్వే చేయాలని నిర్ణయించింది. కాగా, దీనిపై సీఎం జగన్ నేడు ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు.