చాలా మందికి పాలు తాగే అలవాటు ఉంటుంది. అయితే ఈ పాలలో కొంచెం పసుపు వేసుకుని తాగితే ఆరోగ్యపరంగా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. పసుపు పాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కీళ్ల వాపులు, నొప్పులు తగ్గాలంటే పసుపు పాలను క్రమం తప్పక తాగితే ఎంతో ప్రయోజనకరం. ముక్కు దిబ్బడ, తలనొప్పి లాంటివి తగ్గుతాయి. ఆడవారిలో రుతుక్రమం వల్ల కలిగే పొత్తి కడుపు, ఇతర ఒంటి నొప్పులను దూరం చేస్తుంది.