ప్రభుత్వమేమో ప్లాస్టిక్ నిషేదించాలని పారిశుద్ధ్యం మెరుగు పరచాలని గొప్పలు చెబుతుంటుంది. కానీ హిందూపురం పట్టణానికి ఆనుకుని ఉన్న శ్రీకంఠపురం చెరువులో పై ఫోటోలో దుస్థితి చూస్తే చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలతో పేరుకుంది. సమీపంలో ఉన్న ఓ కళ్యాణ మండపంలో శుభకార్యాలు జరిగినప్పుడు వాడిపడేసిన ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు ఇక్కడే పారబోస్తున్నారు. దీంతో అక్కడ దుర్గంధం వెదజల్లుతోంది. నిత్యం ఈ దారిలో వేలాదిమంది ప్రయాణిస్తుంటారు. ఈ దుర్వాసనకు ఇబ్బంది పడుతున్నారు. కళ్యాణ మండప నిర్వాహకులకు అధికారులు హెచ్చరిక జారీచేయాల్సిన అవసరం ఉంది. వాడిపడేసిన ప్లాస్టిక్ తోపాటు ఇతర వ్యర్థాలను పట్టణానికి దూరంగా వేయాలని నిబంధనలు పెట్టాల్సిన అవసరం ఉందని చెరువులో దీనిని చూసిన వారు అంటున్నారు.