ఇళ్లను ఏవిధంగా శుభ్రంగా ఉంచు కుంటారో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిష నర్ బండి శేషన్న మహిళలకు సూచించారు. సోమవారం గుంతకల్లు పట్టణంలోని 7వ వార్డు పాత గుంతకల్లులో కార్మికులు చేస్తున్న పారిశుధ్య పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఆ కాలనీలోని మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇళ్లను ఏవిధంగా శుభ్రంగా ఉంచుకుంటరో ఇళ్ల ముందు పరిసరాలను పరి శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అప్పుడే సీజనల్ వ్యాధుల నుండి రక్షణ ఉంటుందన్నారు. ఆయనతో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, సచివాలయం శానిటరీ కార్యదర్శి ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa