సారవకోట మండలంలోని వడ్డినవలస గ్రామంలో వెలసి ఉన్న శ్రీ త్రినాధ స్వామి వారి 66వ వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం శ్రీ లక్ష్మీ నారాయణ మరియు పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఉదయం 6 గంటల నుంచి గణపతి పూజ పుణ్యాహవాచనం స్తంభ ప్రతిష్ట శిఖర పతాకావిష్కరణ, హోమములు, నీరాజన మంత్రపుష్పాలు మొదలగు కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవం సాయంత్రం నాలుగు గంటలకు ఆలయ అర్చకులు మనోజ్ శర్మ ఆధ్వర్యంలో హైదరాబాద్ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ పి కేశవ శర్మ గురుస్వామి పర్యవేక్షణలో నిర్వహించారు. రాత్రి 7 గంటలకు బ్రహ్మ విష్ణు మహేశ్వర తిరువీధి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్వామివారి 66వ వార్షికోత్సవ సందర్భంగా భక్తులు అనేకమంది తమ కోరికలు తీరడానికి అరటి గెలలు స్వామివారి ఆలయం ఆవరణలో కట్టారు. ఉదయం నుంచి అనేక మంది భక్తులుస్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.