గుంతకల్లు మండలంలోని కసాపురం గ్రామంలోని సుప్రసిద్ద పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో మూడు రోజులు పాటు జరిగే ఉగాది ఉత్సవాలపై సోమవారం దేవాలయ పరిధిలోని రామదూత నిలయంలో ఆర్డీఓ కె. రవీంద్ర అధ్యక్ష తన సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈ సమీక్షా సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఆర్డీఓ రవీంద్ర మాట్లాడుతూ శ్రీ స్వామి వారి ఉత్సవాలకు వచ్చే వేలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఉత్సవాలను విజయవంతంగా జరిగేలా చూడా లని అన్నారు. పండుగ పర్వదినాన భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని కావున వారికి స్నానపు గదులు, మరుగు దొడ్లు, తాగునీటి వసతి ఇబ్బందులు లేకుండా చూడాల న్నారు. రథోత్సవం సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటున్న సందర్భంలో అగ్నిమాపక, పోలీసు శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పారిశుధ్యం, విద్యుత్తు దీపాలు విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆలయ ఈఓ వేంకటేశ్వర రెడ్డి, అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ఇతర శాఖల అధికా రులు పాల్గొన్నారు.