గుంతకల్లు పట్టణంలోని మండి బజారులోని తాగునీటి నిల్వ ట్యాంకు నిండిపోయి మండి బజార్ కాలనీలోకి తాగునీరు వృధాగా రోడ్డుపై పోవడాన్ని చూసిన మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న వాటర్ సరఫరా చేసే సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళ వారం ఆ ప్రాంతంలో పారిశుధ్య పనులను పరిశీలించేందుకు వెళ్ళిన కమీషనర్ కు ఆ దృశ్యం కంటప డింది. దీంతో ఆయన మాట్లాడుతూ అసలే వేసవి కాలంలో ఇలా తాగు నీరు వృధాగా రోడ్లపై పోతుంటే నీటి ఇబ్బందులు ఏర్పడతాయని మరో సారి ఇలా తాగునీరు వృధాగా రోడ్లపై వెళితే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరిం చారు. అనంతరం 36వ వార్డులో కార్మికులు చేస్తున్న పారిశుధ్య పనులను ఆయన పరిశీలించారు. అదేవిధంగా ఆ వార్డు కార్యదర్శి హాజరు పట్టికను పరిశీలించారు. ఆయనతో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఉన్నారు.