మార్చి నెల మొదటి వారం ముగుస్తుంది రానున్నది భగభగలాడే వేసవికాలం ఇప్పటి వరకు ఎలా ఉన్నా ఇప్పటి నుండి భానుడు దెబ్బకు ప్రజలు అల్లాడక తప్పదు. దానికి తోడు దాహార్తి, నీటి అవసరం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రజలకు అవసరమైన నిటి సరఫరా అందించడంలో అధికారులు ఫలితాలు సాధిస్తారా లేక నీటి కోసం వేచి చూసే పరిస్థితి కల్పిస్తారా!! అనేది ప్రశ్నగా మారింది. ప్రకాశం జిల్లా ఎంతో వెనకబడిన ప్రాంతమైన ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో త్రిపురాంతకం, ఎర్రగొండపాలెం, పుల్లలచేరువు దోర్నాల మండలాల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీటి నిల్వకోసం ట్యాంకర్లు, సమ్మర్ స్టోరేజీలు అధికారులు, నాయకులు ఏర్పాటు చేసినప్పటికీ నీటి కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏరోజుకారోజు అన్నట్లు ఉండటం గమనార్హం.
సమ్మర్ స్టోరేజ్ లు ఉన్న అంతంత మాత్రమే సాగర్ నుండి వచ్చే నీరు సమ్మర్ స్టోరేజ్ ద్వారా ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాలకు నీరు సరఫరా చేస్తున్నారు. పలు గ్రామాలలో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. అయినప్పటికీ నీరు సరిపడక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పథకం ద్వారా ఇంటి ఇంటికి కోలాయి ఏర్పాటు అని చెప్పిన అది పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అధికారులే చెప్పాలి. ఏది ఏమైనా రానున్న వేసవి కాలంలో నీటి కోసం ఎదురుచూపులు, ఇబ్బందులు తప్పక తప్పదు అంటున్నారు నియోజకవర్గ పరిధిలోని ప్రజలు.