పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం ఉదయం విశాద చోటుచేసుకుంది. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ ఉదయపురంలో నివాసముంటున్న రాజాం సురేష్ భార్య విజయకు పురిటి నొప్పులు రావడంతో, పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. డాక్టరు వస్తారని చెప్పి, విధులలో ఉన్న సిబ్బంది ఆమెకు డెలివరీ చేశారు. డెలివరీ చేసే విధానంలో లోపం ఉండటంతో పసిబిడ్డ మృతి చెందిందని సురేష్ ఆరోపించారు. సురేష్ ఒక దినపత్రికు రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కావలసిన సదుపాయాలు ప్రభుత్వం చేపడుతున్నప్పటికీ సిబ్బంది తీరు మాత్రం మారకపోవడం శోచనీయమని స్థానిక ప్రజలు అంటున్నారు.