ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో సీబీఐ బీహార్ మాజీ సీఎం లాలూప్రసాద్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. సోమవారం ఆయన సతీమణి రబ్రీదేవి ఇళ్లలో సీబీఐ దాడులు చేసిన సంగతి తెలిసిందే. దాడుల అనంతరం ఆమెను విచారించిన సీబీఐ ఈ రోజు లాలూను కూడా విచారించబోతోంది. కాగా ఆయన రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగాలు ఇప్పించేందుకు కొంతమంది అభ్యర్థుల నుంచి భూములు తీసుకున్నారన్న అభియోగాలపై నమోదైన కేసు విచారణలో భాగంగా ఈ నోటీసులు ఇచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa