చాలామంది ఇళ్లల్లోని స్టోర్ రూమ్ లలో పాత సామాన్లను వేసి నింపుతూ ఉంటారు. స్టోర్ రూమ్ లో సైతం ఈశాన్యం వైపు బరువు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఈశాన్యంలో తెలిసీతెలియక బరువైన వస్తువులు పెడితే దాని ప్రభావం కచ్చితంగా జీవితం పైన ఉంటుంది. ఈశాన్యం వైపు వస్తువులు మాత్రమే కాదు, పెద్ద పెద్ద చెట్లు కూడా లేకుండా చూసుకోవాలి. ఎంత ఖాళీగా ఉంటే, ఎంత శుభ్రంగా ఉంటే అంత కలిసి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.