గుజరాత్ మెహసానాలోని ‘శ్రీమద్ యశోవిజయ్ జీ జైన్ సంస్కృత పాఠశాల’ పూర్తిగా ప్రత్యేకం. 1897లో స్థాపించిన ఈ పాఠశాలలో ఆరేళ్ల వరకూ ఉచితంగా విద్య, ఆహారం అందిస్తారు. చదువు పూర్తి చేసిన విద్యార్థులకు వారి విద్యార్హతను బట్టి రూ.లక్ష నుంచి రూ.6 లక్షల వరకూ అందజేస్తారు. ప్రస్తుతం అక్కడ 2,850 మంది విద్యార్థులు చదువుతున్నారు. కొత్తగా జైన్ సంస్కృత పాఠశాలను నిర్మిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.