దేశంలో తొలిసారిగా ఈ ఏడాది నుంచి డిజిటల్ వర్శిటీ ప్రారంభించేలా యూజీసీ సన్నాహాలు చేస్తోంది. విద్యార్థులు కోరుకున్న కోర్సులను ఆన్ లైన్ ద్వారా అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, కేంద్రీయ వర్శిటీలతో పాటు ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యా సంస్థలన్నీ ఈ వర్శిటీ పరిధిలో తమ కోర్సులు అందించనున్నాయి. విద్యార్థులు ఏ కోర్సులోనైనా 50 శాతం క్రెడిట్లు సాధిస్తేనే డిగ్రీని ప్రధానం చేస్తారు.