భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO ) నేడు ఓ ఉపగ్రహాన్ని కూల్చేయనుంది. 2011లో ప్రయోగించిన వెయ్యి కిలోల మేఘా ట్రాపికే-1 జీవితకాలం ముగియడంతో దాన్ని నియంత్రిత విధానంలో కూల్చేసేందుకు నిర్ణయించింది. ఈరోజు సాయంత్రం 4.30 నుంచి రాత్రి 7.30 గంటలలోపు భూమిపై దీనిని కూల్చేయనున్నారు. అయితే ఎటువంటి ప్రమాదం లేని ప్రాంతం గుండా శాటిలైట్‌ను భూవాతావరణంలోకి ప్రవేశించేలా ఇస్రో చర్యలు తీసుకుంది.