సెలబ్రిటీలకు కేంద్రం షాక్ ఇచ్చింది.సెలెబ్రిటీలు చేసే వ్యాపార ప్రకటనలకు కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ‘‘సదరు ఉత్పత్తి, సేవలను సెలెబ్రిటీలు వాస్తవంగా ఉపయోగించి, అనుభవం పొందిన తర్వాతే సిఫార్సు చేయాలి. వీటిని తప్పనిసరిగా అడ్వర్టైజ్‌మెంట్ అని తెలిసేలా బహిరంగంగా ప్రదర్శించాలి’’ అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఓ వస్తువులో లేని గుణాల గురించి ప్రచారం చేయటం నేరమని వెల్లడించింది.