లోకేష్ తనను తాను ముఖ్యమంత్రితో పోల్చుకుంటున్నారని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముందు లోకేష్ ఒక బచ్చా అంటూ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. ముకేష్ అంబానీని విమర్శించే స్థాయి లోకేష్‌కు ఉందా.. లోకేష్ స్థాయి ఏంటి అన్నారు. జగన్ ఒక పార్టీ పెట్టుకొని ముఖ్యమంత్రిగా గెలిచారని.. జగన్‌ను ప్రజలు స్వాగతించారని తెలిపారు. లోకేష్ మూడు శాఖలకు మంత్రిని చేశాను అంటున్నారని.. కనీసం ఎమ్మెల్యేగా గెలవలేదన్నారు.
టీడీపీ (ఒధఊ) హయాంలో జరిగిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో భారీగా అవినీతి జరిగిందని ఆయన న్నారు. ఈ స్కామ్ సూత్రధారి నారా లోకేష్ డమ్మీ ఒప్పందం చేసుకుని రూ. 300 కోట్లు ప్రజాధనం మింగేశారని ఆరోపించారు. షెల్ కంపెనీల ద్వారా ఈ సొమ్ము టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయన్నారు. త్వరలోనే నిజాలన్నీ బయటపడతాయన్నారు.
తెలుగు డ్రామా పార్టీ కొంతమందిని ఏర్పాటు చేసి డ్రామా చేస్తోందన్నారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని.. సీఎం జగన్ లీడర్‌షిప్‌పై నమ్మకంతో పెట్టుబడులు పెట్టారన్నారు. ఒక్క ఫోన్ కాల్‌తో ఏ సమస్య వచ్చినా తీరుస్తామని సీఎం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా సరే కడుపు మంటతో ఒక సెక్షన్ బురదజల్లుతోందన్నారు. కియా ఫ్యాక్టరీని చంద్రబాబు తీసుకురాలేదని.. కేంద్రం సిఫార్సు చేస్తే రాష్ట్రానికి వచ్చారన్నారు. అందులో ఎవరి పాత్ర ఏమీ లేదన్నారు. అభివృద్ధిని అడ్డుకునే వారికి చెంపపెట్టు సమాధానం ఇవ్వాలని.. ఏపీ గ్రోత్ రేటు 11.4శాతం ఉందన్నారు. ప్రతి పనిని తప్పు పట్టాలని చూస్తున్నారన్నారు.