అఫ్గానిస్తాన్ కు సాయం చేసేందుకు భారత్ ముందుకొచ్చింది. అఫ్గాన్ కు ఇరాన్ పోర్టు ద్వారా 20 వేల మెట్రిక్ టన్నుల గోధుమలను సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. కజికిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్ మెనిస్తాన్, కిర్గిజ్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని తెలిపింది. అఫ్గాన్ లో తీవ్రవాదాన్ని కట్టడి చేసి, మహిళలు, మైనార్టీలకు సమాన హక్కులు కల్పించాలని ఈ దేశాలు సంయుక్తంగా ప్రకటించాయి.