జీకే. వీధి మండలంలో మంగళవారం పాడేరు సబ్ కలెక్టర్ అభిషేక్ విస్తృతంగా పర్యటించారు. ముందుగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ బూతును పరిశీలించారు. అనంతరం సీలేరు చేరుకుని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతును తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిమిత్తం నోడల్ అధికారిగా తనను నియమించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో జీకే. వీధి మండలంతోపాటు సీలేరు పోలింగ్ బూతులలో అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయో లేదో తనిఖీలు చేసినట్లు చెప్పారు. సీలేరు పోలింగ్ బూతులో చిన్నచిన్న రిపేర్లు తప్ప ఇతర సమస్యలు ఏమీ లేవని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి. చాణిక్యరావు ఎన్‌ఆర్‌ఇజిఎస్ ఏపీఓ ఎల్. రాములు జీకే. వీధి తహశీల్దార్ జి. రాజ్ కుమార్, ఆర్‌ఐ మహదేవ్ వీఆర్వో శ్రీనివాస్ సీలేరు సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కుసుమ మహిళా పోలీస్ రేవతి ఉన్నారు.