మహిళా దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. చట్టసభల్లో, అన్నిచోట్లా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. సృష్టిలో సగభాగం మహిళ, ప్రతి మనిషి జీవితంలో కీలకపాత్ర పోషించే ఆడపడుచులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. సంపూర్ణ స్త్రీ సాధికారత సాధించాలని ఆకాంక్షిస్తున్నాం అంటూ ట్వీట్ చేశారు.