ఏపీ, తెలంగాణలో ఫీవర్ కేసులు పెరిగిపోతున్నాయి. ఏపీలో ఇప్పటి వరకు 20వేల ఫీవర్ కేసులు, తెలంగాణలో 5 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. చాలా మంది జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, జ్వరంతో బాధపడుతున్నారు. ఇన్ ఫ్లుయెంజా వైరస్ లోని సబ్ వేరియంట్ ప్రభావంతో ఈ ఫీవర్లు ఎక్కువైతున్నాయని వైద్యులు తెలిపారు. చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. ముక్కు, నోరును ఎక్కువగా తాకొద్దని, యాంటీబయాటిక్స్ తీసుకోవద్దని వైద్యులు తెలిపారు. కరోనా వైరస్ లాగే ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. ప్రజలంతా మాస్క్ ధరించి, స్వీయ జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.