గుంటూరు నగరపాలెం యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏటి. అగ్రహారం 11/2లో విద్యాసాగర్ (27) నివాసం ఉంటున్నాడు. మద్యానికి బానిసై మానసికంగా కుంగిపోయాడు. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో విద్యాసాగర్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు