కర్ణాటకలోని తుమకూరులో నిర్మించిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెలికాఫ్టర్ ఫ్యాక్టరీని ఫిబ్రవరి 6న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇది ఆసియాలోనే అతి పెద్ద హెలికాఫ్టర్ ఫ్యాక్టరీ. ఇది పూర్తిస్థాయి గ్రీన్ ఫీల్డ్ హెలికాఫ్టర్ పరిశ్రమ. ఇందులో మొదట లైట్ యుటిలిటీ హెలికాఫ్టర్లను ఉత్పత్తి చేయనున్నారు. భవిష్యత్తులో లైట్ కంబాట్ హెలికాఫ్టర్, ఇండియన్ మల్టీ రోల్ హెలికాఫ్టర్లు వంటివి తయారు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.