ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తల్లిమందలించిందని అలిగి వెళ్ళిపోయిన కొడుకు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2023, 02:19 PM

మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి యర్రబాలెం బసవతారక నగర్ కు చెందిన ఓ పదో తరగతి విద్యార్థి అదృశ్యమైన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం బసవతారక నగర్ కు చెందిన తొమటం ఆనందరాజు- భూలక్ష్మి దంపతుల కుమారుడు ఏసు నగర పరిధిలోని పెనుమాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు.


ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం తన సోదరుని తో కలిసి సరదాగా ఇంట్లోనే ఆట ఆడుతుండగా గమ్ము బాటిల్ కిందపడింది. దీంతో తల్లి భూలక్ష్మి మందలించించగా మనస్థాపం చెందిన ఏసుబాబు అదేరోజు మధ్యాహ్నం 2: 30 సమయంలో అలిగి ఇంట్లో నుంచి ఎటో వెళ్లిపోయాడు. రాత్రి సమయమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు తమ కుమారుడు ఏసుబాబు ఆచూకీ కోసం వెతుకులాట ప్రారంభించారు. తమ కుమారుని అదృశ్యంపై మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com