తమిళనాడు రాష్ట్రం చెన్నై వెస్ట్‌లోని బీజేపీ ఐటీ విభాగానికి చెందిన 13 మంది కార్యకర్తలు పార్టీని వీడారు. బీజేపీ ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు అన్బరసన్ మాట్లాడుతూ ‘‘నేను బీజేపీ కోసం ఏళ్ల తరబడి పనిచేశాను. ఏ పదవి ఆశించలేదని ప్రజలకు తెలుసు. గత కొద్ది రోజులుగా పార్టీలో నెలకొన్న అసాధారణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా’’ అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa