అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను పురస్కరించుకొని బుధవారం పెనుకొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సతీమణి జయలక్ష్మి, స్థానిక మహిళా ప్రజాప్రతినిధులు, మహిళలతో కలిసి ఎమ్మెల్యే శంకర నారాయణ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర నారాయణ గమాట్లాడుతూ దేశం లో ఎక్కడా లేనివిధంగా మహిళలకు అత్యంత ప్రాధాన్యత నిచ్చి చట్టసభలలో స్థానం కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి దక్కిందని అన్నారు. పెద్దపీట వేసి వారి రక్షణ కొరకు దిశా చట్టాన్ని తీసుకొచ్చి వారికి రక్షణ కల్పిస్తున్నారు అదేవిధంగా మహిళలు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మహిళలు చాలా సంతోషంగా ఉన్నారని అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ పట్టణ, మండల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.