ఈనెల 13వ తేదీ జరుగనున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల విషయమై కళ్యాణదుర్గం డివిజన్ పరిధిలో ఏర్పాటు చేస్తున్న అన్ని పోలింగ్ కేంద్రాలను బుధవారం కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. నిషాంత్ రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ బూత్ స్థాయి నుంచి ప్రణాళికా బద్ధంగా పోలింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రంలోని ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళిక తయారు చేయాలన్నారు. బ్యాలెట్ బాక్సుల ఏర్పాటు, పోలింగ్ ఏజెంట్ల ప్రాంతం, బ్యాలెట్ పేపర్ నిర్వహణకు అనుగుణంగా బెంచీలు ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ కొరకు మార్చి 13వ తేది ఓటర్లకు సెలవు దినంగా ప్రకటించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.