అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ చరణ్ మహిళలతో కలిసి కేక్ కట్ చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళా సాధికారతే లక్ష్యంగా సీఎం జగనన్న పాలన కొనసాగిస్తున్నారన్నారు. కావున ప్రతి మహిళ అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ తోటి మహిళా లోకానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.