శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండల పరిధిలోని విభూదిపల్లి గ్రామంలో బుధవారం డాక్టర్ కృష్ణమోహన్ జింక ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ తాలూకా అధ్యక్షులు కే సతీష్ కుమార్, పరిటాల శ్రీరామ్ చారిటబుల్ ట్రస్ట్ నాగరాజు, యుగంధర్ సమక్షంలో కంటి వైద్య శిబిరము నిర్వహించారు. ఈ శిబిరంలో కంటికి సంబంధించిన సమస్యలను పరిక్షించారు. తర్వాత కంటి ఆపరేషన్ అవసరమైన వారికి డాక్టర్ కృష్ణమోహన్ జింక ఆసుపత్రిలో ఉచితంగా కంటి ఆపరేషన్ కొరకు పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ శిబిరంలో దాదాపు 50 మందికి వైద్య పరీక్షలు చేశారు.