ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దొంగ ఓట్లుకు సహకరిస్తున్న అధికారులను ఉరితీయాలి: కె. నారాయణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2023, 05:14 PM

తిరుపతిలో భారీగా దొంగ ఓట్లు ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. దొంగ ఓట్లు నమోదు చేయించిన అధికారులను ఉరి తీయాలని ఆయన డిమాండ్ చేశారు. 'ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లను నమోదు చేయించిన రెవెన్యూ అధికారులను ఉరి తీయాలి. తిరుపతిలోని వైసీపీ పడమటి కార్యాలయం చిరునామాతో.. 36 దొంగ ఓట్లను నమోదు చేశారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని నగ్నంగా ఖూనీ చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు ఎన్ని అక్రమాలకు పాల్పడినా.. పీడీఎఫ్ అభ్యర్థుల విజయం ఖాయం. ఏపీలో రాక్షస పాలన కొనసాగుతోంది. వాలంటీర్ ఇంట్లో 22 ఓట్లు నమోదు చేయించారు. ఒక మహిళకు 21 మంది భర్తలు ఉన్నట్లు సృష్టించి ఓట్లు నమోదు చేశారు' అని నారాయణ ఆరోపించారు.


'యశోద నగర్‌లోని ఖాళీ స్థలంలో 11 ఓట్లు నమోదు చేయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అక్రమాలకు అంతు లేకుండా పోతోంది. ఒక్క తిరుపతి నగరంలో 7 వేల దొంగ ఓట్లున్నాయి' అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన ఆరోపణలు చేశారు. నారాయణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కేవలం నారాయణ మాత్రమే కాదు.. ఇటు టీడీపీ కూడా దొంగ ఓట్లపై ఆరోపణలు చేస్తుంది. ముఖ్యంగా వాలంటీర్ల వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa